Fashion

Saturday 15 May 2021

,

 

Google: వినియోగదారులకు భారీ షాకిచ్చిన గూగుల్.. జూన్ 1 నుంచి ఆ సేవలకు డబ్బులు చెల్లించాల్సిందే.. వివరాలివే..

Google Photos: టెక్ దిగ్గజం గూగుల్ తన ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఉచితంగా అందించిన పలు సేవలకు ఇక డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.

Google: వినియోగదారులకు భారీ షాకిచ్చిన గూగుల్.. జూన్ 1 నుంచి ఆ సేవలకు డబ్బులు చెల్లించాల్సిందే.. వివరాలివే..

మీకు గూగుల్ అకౌంట్ ఉందా? మీ ఫోటోలు, వీడియోలను గూగుల్ ఫోటోస్‌ యాప్‌లో ఉచితంగా స్టోర్ చేసుకుంటున్నారా? అయితే ఇకపై అలా కుదరదు. ఇందుకు డబ్బు చెల్లించాల్సిందే. గత కొన్నేళ్లుగా గూగుల్ ఫోటోస్, డ్రైవ్‌లో ఫోటోలు, వీడియోలను ఉచితంగా సేవ్ చేసుకునే సౌలభ్యమిచ్చింది గూగుల్ సంస్థ. అయితే జూన్ 1 నుంచి ప్రీమియం వెర్షన్‌కు మారి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఫోటోలు, వీడియోల ఉచిత బ్యాకప్‌ను ఆపివేయనున్నట్లు గూగుల్ గతేడాదే ప్రకటించింది. ఇప్పటివరకు హై క్వాలిటీ ఫోటోలు, వీడియోలు నిల్వ చేసేందుకు గూగుల్ ఫోటోస్, డ్రైవ్‌లో 15జీబీ స్టోరేజి లిమిట్ ఉంది. ఇందులో స్టోర్ చేసుకున్న బ్యాకప్ ఫైల్స్‌ను ల్యాప్ టాప్‌లో లేదా కంప్యూటర్లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశమిచ్చింది. అయితే జూన్ 1 నుంచి ఈ అవకాశం లేదు. ఒకవేళ ఈ సేవను ఉపయోగించుకోవాలంటే గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకొని ప్రీమియం చెల్లించాలి.

Fake Google Chrome: 'గూగుల్ క్రోమ్' పేరుతో నకిలీ యాప్... వెంటనే డిలిట్ చేయండి

\1\6వివిధ రకాల ప్లాన్లు..

జూన్ 1 తర్వాత గూగుల్ అనుబంధ సర్వీసులైన జీమెయిల్, డ్రైవ్, గూగుల్ పోటోస్‌లో డేటా లిమిట్ 15జీబీ వరకు ఉచితంగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ డేటా అవసరమైతే గూగుల్ వన్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇందుకు రకరకాల ప్లాన్లు అందుబాటులో ఉండనున్నాయి. 100 జీబీ డేటా నుంచి 30 టీబీ క్లౌడ్ స్టోరేజ్ వరకు వివిధ సబ్ స్క్రిప్షన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇది యాపిల్ వన్ సబ్‌స్క్రిప్షన్‌కు సమానంగా ఉంటుంది. అయితే ఇందులో కొన్ని అదనపు బెనిఫిట్లు ఉంటాయి. ఈ ప్రీమియం ప్లాన్స్ ద్వారా అదనంగా సభ్యులను కూడా యాడ్ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులను, సన్నిహితులను ఇందులో భాగం చేయడానికి అనుమతిస్తుంది. భారత్ మినహాయించి ఎంచుకున్న దేశాల్లో వినియోగదారులు గూగుల్ వీపీఎన్ సర్వీస్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.

గూగుల్ వన్ యాప్..

100 జీబీ గూగుల్ ప్లాన్ తీసుకోవాలంటే నెలకు రూ.149 చెల్లించాలి. ఏడాదికైతే ధర రూ.1499 ఉంటుంది. 200 జీబీ ప్లాన్‌కు నెలకు రూ.219, సంవత్సరానికి రూ.2199 ఖర్చు అవుతుంది. అనంతరం 2టీబీ ప్లాన్ అయితే నెలకు రూ.749, సంవత్సరానికి రూ.7,500 ఖర్చు అవుతుంది. ఈ ప్లాన్స్ గూగుల్ వన్ యాప్ ఉన్న ఐఓఎస్ యూజర్లకు మరింత చౌకగా లభించనున్నాయి. బేసిక్ ప్లాన్ అయిన 100 జీబీ రూ.130, ఏడాదికి 1300లకు వస్తుంది. 200 జీబీ ప్లాన్ నెలకు 210, ఏడాదికి 2100 చెల్లించాలి. 2టీబీ ప్లాన్ నెలకు రూ.650, ఏడాదికి రూ.6500 చెల్లించాలి.

ఇవి కాకుండా 10టీబీ, 20టీబీ, 30టీబీ ప్లాన్స్ కూడా నెలవారీ అందిస్తుంది. ఈ ప్లాన్స్ తీసుకోవాలంటే నెలకు రూ.3249, రూ.6500, రూ.9700లు చెల్లించాలి. ఈ మూడు ప్రణాళికలు గూగుల్ వన్ యాప్ లోనే లభిస్తాయి. గూగుల్ వన్ యాప్ యూజర్ల కోసం ప్లాట్ ఫాం వారీగా బ్యాకప్, స్టోరేజీని నిర్వహించడానికి అనుమతిస్తుంది. వినియోగదారుల ఈ యాప్ ద్వారా గూగుల్ సపోర్ట్ ను కూడా ఉపయోగించవచ్చు.

https://www.google.com/search?q=nakkerla&oq=nakkerla&aqs=chrome..69i57j69i60l4.3461j0j7&client=ms-android-oppo&sourceid=chrome-mobile&ie=UTF-8

Friday 14 May 2021

,

 

Abhiram Daggubati: అందరూ చేస్తారు.. కానీ నేను చేసింది బయటపడింది: దగ్గుబాటి అభిరామ్

Abhiram Daggubati: డైరెక్టర్ తేజ దర్శకత్వంలో హీరోగా పరిచయం కానున్నాడు రానా సోదరుడు అభిరామ్. ఇప్పటికే ఆయన నటించిన సినిమా గురించి కొన్ని విషయాలు ప్రకటించగా.. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్నారు.

Abhiram Daggubati: అందరూ చేస్తారు.. కానీ నేను చేసింది బయటపడింది: దగ్గుబాటి అభిరామ్

    Abhiram Daggubati: డైరెక్టర్ తేజ దర్శకత్వంలో హీరోగా పరిచయం కానున్నాడు రానా సోదరుడు అభిరామ్. ఇప్పటికే ఆయన నటించిన సినిమా గురించి కొన్ని విషయాలు ప్రకటించగా.. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ఆర్.పి.పట్నాయక్ సంగీతాన్ని వినిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే అభిరామ్ పై గతంలో శ్రీ రెడ్డి ఇష్యూ బాగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

    ఈ విషయం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిరామ్ కొన్ని విషయాలు పంచుకున్నాడు. తప్పులు అందరూ చేస్తుంటారని, కానీ తాను చేసిన తప్పులు మాత్రం బయటకు వచ్చాయని తెలిపాడు. తనకు నటుడిగా అన్ని రకాల పాత్రల్లో నటించాలని ఆసక్తి ఉందని తెలిపాడు. ముఖ్యంగా లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ వంటి సినిమాలలో నటించాలనుందట.

    ఇక తేజ దర్శకత్వంలో హీరో గా ఎంట్రీ ఇస్తున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని తెలిపాడు. అంతేకాకుండా తనకు ఒకింత భయం కూడా ఉందని అంటున్నాడు. తేజ వర్క్ ఎలా ఉంటుందో తన సోదరుడు రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమాలోనే అర్థమైందని తెలిపాడు. అంతేకాకుండా అభిరామ్ నేరుగా తేజతో నన్ను హీరోగా మీరే పరిచయం చేయాలి సార్ అని ఎన్నోసార్లు అనేవాడట‌. తేజ కూడా తనకోసం ఓ కథ రాస్తానని కూడా అనేవారట.

    ఇక తేజ కథ రాసి తన నాన్నకు చూపించగా వెంటనే కథ నచ్చడంతో హీరోగా పరిచయం అవుతున్నానని తెలిపాడు. ఇక ప్రస్తుతం కరోనా పరిస్థితి వల్ల ఇంకా ప్రారంభించలేదని.. దీని తీవ్రత తగ్గాక సెట్లోకి అడుగు పెడతామని తెలిపాడు. ఇక ఇదిలా ఉంటే గతంలో తనపై జరిగిన క్యాస్టింగ్ కౌచ్, ర్యాష్ డ్రైవింగ్ గురించి స్పందిస్తూ.. తప్పులు అందరూ చేస్తారని, కానీ తాను చేసిన తప్పులు బయటపడ్డాయని, వాటి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు. ఇక ఆ సమయంలో తన కుటుంబం తనకు అండగా నిలబడిందని, ఏ పనులు చేయాలి.. చేయకూడదు అనే విషయం ఇప్పుడు తెలిసిందని అంటున్నాడు. నటుడిగా కెరీర్ ప్రారంభించడానికి ముందు ఇలా జరగడం వల్ల తనకు భవిష్యత్తులో అలాంటి తప్పులు చేయకూడదని అర్థమైందని తెలిపాడు.

    Follow Us @soratemplates